Thu Jan 29 2026 09:09:56 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బెజవాడకు రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు విజయవాడకు రానున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు

సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు విజయవాడకు రానున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం విజయవాడలోని పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ అసెంబ్లీ మరియు చారిత్రక ప్రసంగాల ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు.
ప్రత్యేక ఏర్పాట్లు...
రజనీకాంత్ ప్రత్యేక అతిధిగా వస్తుండటంతో పోలీసులు భారీ బందోబసతును ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం నుంచి కేవలం అనుమతి ఉన్న వారికే అనుమోలు గార్డెన్స్‌లో ప్రవేశం ఉంటుందని తెలిపారు. దీంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ మీద రూపొందించిన పలు లఘుచిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు.
Next Story

