Fri Dec 05 2025 13:17:12 GMT+0000 (Coordinated Universal Time)
Summer Effect : ఠారెత్తిస్తున్న ఎండలు 45 డిగ్రీలు దాటే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు భగ్గుమంటున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు భగ్గుమంటున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల దెబ్బకు జనం ఠారెత్తిపోతున్నారు. ఏప్రిల్ నెలలోనే రోహిణి కార్తెను తలపిస్తుంది. ఒకవైపు ఎండలు కాస్తుండగా, మరోవైపు అక్కడక్కడా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని కూడా తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో నేడు, రేపు నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరే అవకాశముందని కూడా పేర్కొంది. సాధారణంకంటే మరో రెండు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం అలెర్ట్ జారీ చేసింది.
అప్రమత్తం చేసిన...
ప్రధానంగా వృద్ధులు, చిన్నారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఉదయం పది గంటలనుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఎవరూ బయటకు రాకపోవడమే మంచిదని, వడదెబ్బ తగిలే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇదే సమయంలో ఈరోజు, రేపు ఉత్తర,కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని, దక్షిణ కోస్తాలో లో మాత్రం నేడు పొడి వాతావరణం నెలకొని ఉంటుందని చెప్పింది. రాయలసీమలో బలమైన ఈదరుగాలులుతో కూడిన వర్షాలు పడతాయని కూడా చెప్పింది.
గరిష్ట స్థాయిలో...
తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఎండల తీవ్రత మరో రెండు రోజుల్లో అధికం కానుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఈరోజు కూడా ఉత్తర్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని తెలిపింది. రాత్రి వేళ వాతావరణం మరింత పొడిగా మారి వేడెక్కేనుందని, ఉక్కపోత కూడా ఎక్కువ కానుందని వాతా
వాతావరణ శాఖ చెప్పింది. అయితే అదే సమయంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
Next Story

