Sat Mar 07 2026 14:42:03 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఈరోజు ఇంటి నుంచి బయటకు రావద్దు.. ఏపీ వాసులకు వార్నింగ్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఈరోజు ఎవరూ బయటకు రావద్దని వాతావరణ వాఖ అధికారులు హెచ్చరించారు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఈరోజు ఎవరూ బయటకు రావద్దని వాతావరణ వాఖ అధికారులు హెచ్చరించారు. ఇంట్లోనే ఉండటం మేలని హెచ్చరించారు. బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని, ఎక్కువ సేపు బయట ఉండకుండా పని వేగిరం ముగించుకుని వెంటనే ఇంటికి వెళ్లాలని సూచిస్తున్నారు.
రోహిణికార్తె కావడంతో...
రోహిణికార్తె కావడంతో భారీ ఉష్ణోగ్రతలు నేడు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు నేడు నలభై ఐదు డిగ్రీలు దాటే అవకాశముందని తెలిపింది. నేడు ఆంధ్రప్రదేశ్ లోని 145 మండలాల్లో తీవ్ర వడగాలులు. కూడా వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Next Story

