Wed Dec 17 2025 14:12:54 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు.నేటి నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు.నేటి నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 16 నుంచి పూర్తిస్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. కానీ అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 15, 22, 29వ తేదీల్లో విచారణలు చేపడతాయి. మే 15, 22వ తేదీల్లో న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా విచారణలు చేయనున్నారు.
అత్యవసర వ్యాజ్యాలకు...
మే 29న జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ వై.లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా కేసులు విచారించనున్నారు. రెండోదశ వెకేషన్ కోర్టులు జూన్ 5, 12వ తేదీల్లో విచారణ చేపడతాయి. జూన్ 5, 12వ తేదీల్లో జస్టిస్ జస్టిస్ ఎం.కిరణ్మయి, జస్టిస్ టి.సి.డి.శేఖర్ డివిజన్ బెంచ్, జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్ నిర్వహిస్తారు. హైకోర్టు వేసవి సెలవులు కావడంతో కేవలం అత్యవసర కేసులను మాత్రమే వెకేషన్ బెంచ్ లు విచారణ జరపనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు.
Next Story

