Sun Mar 15 2026 07:29:57 GMT+0530 (India Standard Time)
Holidays : నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24వ నుంచి జూన్ 11 వరకూ విద్యాశాఖ సెలవులను ప్రకటించింది

నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకూ విద్యాశాఖ సెలవులను ప్రకటించింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వేడి గాలుల తీవ్రత కూడా ఈ ఏడాది ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది వేసవి సెలవులు యాభై రోజులు ఇచ్చినట్లయింది.
జూన్ 12న ప్రారంభం...
ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అన్ని పాఠశాలలు వేసవి సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రయివేటు పాఠశాలలు వేసవి సెలవుల సమయంలో తెరిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలు తిరిగి జూన్ 12వ తేదీన ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
Next Story

