Thu Dec 18 2025 05:16:38 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టు తరలింపు సాధ్యం కాదు
అమరావతి, పోలవరం పూర్తయి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరిగి ఉండేదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు.

అమరావతి, పోలవరం పూర్తయి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరిగి ఉండేదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. హైకోర్టును కదిలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. కర్నూలులో న్యాయరాజధాని అంటే అందరూ నవ్వుతున్నారని సుజనా చౌదరి అన్నారు. మళ్లీ రాష్ట్రపతి నోటిఫికేషన్ రావాల్సి ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో గత మూడేళ్లుగా అభివృద్ధి అనేది లేకుండా పోయిందన్నారు. ఉన్న పరిశ్రమలూ తరలి వెళ్లిపోతున్నాయని చెప్పారు.
నమ్మకం లేదు....
హైకోర్టు తీర్పుతో అమరావతి రాజధానిని ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్న నమ్మకం తనకు లేదని సుజనా చౌదరి చెప్పారు. ఈ ప్రభుత్వానికి అంత సమర్థత లేదని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే అమరావతి భవిష్యత్ ను నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి పూర్తి స్థాయిలో అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
Next Story

