Sun Mar 15 2026 18:03:32 GMT+0530 (India Standard Time)
ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర
ఒక్కసారిగా టమాటా రేటు పడిపోయింది. మదనపల్లి మార్కెట్ లో ఇప్పుడు కిలో టమాటా ధర కేవలం పది రూపాయలు మాత్రమే.

నిన్నటి మొన్నటి వరకూ మార్కెట్ లో టమాటా ధర వందరూపాయలకు పైగానే పలికింది. గడిచిన పది రోజుల నుంచి కిలో యాభై రూపాయలు. అయితే ఒక్కసారిగా టమాటా రేటు పడిపోయింది. మదనపల్లి మార్కెట్ లో ఇప్పుడు కిలో టమాటా ధర కేవలం పది రూపాయలు మాత్రమే. టమాటా దిగుబడి అధికంగా పెరగడం కారణంగానే ధర పడిపోయిందని మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు.
మార్కెట్ కు క్యూ....
నిన్నటి వరకూ మదనపల్లి మార్కెట్ కు టమాటా అతి తక్కువ లోడ్లు వచ్చేవి. అయితే వర్సాలు కురియడంతో టమాటా పంట బాగా పండింది. దీంతో మార్కెట్ కు రైతులు క్యూ కడుతున్నారు. టన్నుల కొద్దీ టమాటా మార్కెట్ కు రావడంతో దాని ధర అమాంతం పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో ఇరవై రూపాయలు పలుకుతుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా టమాటా మదనపల్లి మార్కెట్ కు తీసుకువస్తున్నారు. టమాటా లోడ్ల లారీలతో మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి.
Next Story

