Fri Dec 05 2025 15:43:29 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏపీలో మరో ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్ లో వరస ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ప్రమాదం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో వరస ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు గాయపడ్డారు.
రసాయనాలు కలుపుతుండగా...
అయితే ఫార్మాకంపెనీలో రసాయనాలు కలుపుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెెబుతున్నారు. వెంటనే గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. రెండురోజుల క్రితమే అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి పదిహేడు మంది మరణించిన ఘటన మరవకముందే మరొక ఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సరైన చికిత్స అందించాలని ఆదేశించారు.
Next Story

