Mon Feb 23 2026 14:18:29 GMT+0530 (India Standard Time)
సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది

సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం నిరాకరించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఏకసభ్య కమిటీ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. -సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్లో ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది.
విచారణ చేయవచ్చని...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఏకసభ్య కమిషన్ విచారించవచ్చన్న సుప్రీం కోర్టు సీఎం బహిరంగ వేదికలపై ప్రకటనలు చేస్తున్నారన్న వాదనలు తోసిపుచ్చింది. పరిపాలన అంశాలపై విచారణకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చన్న సుప్రీంకోర్టు సిట్ నివేదిక మేరకే వైఫల్యాలు, లోపాలు, బాధ్యులను గుర్తించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏకసభ్య కమిషన్ విచారణను కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. సిట్ తదుపరి దర్యాప్తు కూడా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Next Story

