Wed Jan 28 2026 23:51:59 GMT+0000 (Coordinated Universal Time)
Alllu Arjun : ఏపీ హైకోర్టుకు అల్లు అర్జున్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పిటీషన్ దాఖలు చేశారు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పిటీషన్ దాఖలు చేశారు. నంద్యాలలో తనపై నమోదయిన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటీషన్ లో కోరారు. గత ఎన్నికల సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటించారు. తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ అభిమానుల తొక్కిసలాట జరిగింది. ఎన్నికల నిబంధనలను పాటించలేదని ఆరోపిస్తూ పోలీసులు నాడు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు.
క్వాష్ చేయాలని...
ఈకేసును క్వాష్ చేయాలని అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే హైకోర్టు అల్లు అర్జున్ పిటీషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు విచారణ చేపట్టనుంది. 144వ సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలుల్లో ఉండగా భారీ జన సమీకరణ చేపట్టినందుకు అల్లు అర్జున్ పై పెట్టిన కేసు ఆయనకు ఇబ్బందిగా మారడంతో కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరుపున న్యాయవాదులు కొద్దిసేపటి క్రితం హైకోర్టులో పిటీషన్ ను దాఖలు చేశారు.
Next Story

