Sun Mar 08 2026 02:56:26 GMT+0530 (India Standard Time)
రెండు మృతదేహాలు లభ్యం
అనకాపల్లి జిల్లా పూడిమడిక బీచ్ లో స్నానానికి వెళ్లిన విద్యార్థులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకూ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి

అనకాపల్లి జిల్లా పూడిమడిక సముద్రతీరంలో స్నానానికి వెళ్లిన విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఇప్పటి వరకూ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఒక మృతదేహం లభ్యంకాగా, నేడు మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అనకాపల్లి జిల్లాలోని ఒక ఇంజినీరింగ్ విద్యార్థులు 15 మంది కలసి పూడిమడిక సముద్రతీర ప్రాంతానికి స్నానానికి వెళ్లారు. అయితే ఒక్కసారిగా వచ్చిన రాకాసి అల వారిని లోపలికి తీసుకుంది. ఇందులో ఏడుగురు గల్లంతయ్యారు.
మృత దేహాల కోసం...
మృత దేహాల కోసం నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు లభించిన మృతదేహాలు జగదీష్, గణేష్ లవి గా గుర్తించారు. మరో నలుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యమవ్వాల్సి ఉంది. వారి బంధువులు మిగిలిన వారి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. హెలికాప్టర్ సాయంతో కోస్ట్ గార్డ్స్ గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story

