Sun Mar 15 2026 22:08:26 GMT+0530 (India Standard Time)
మండలిలో బలం పెంచుకున్న వైసీపీ
శాసనమండలిలో వైసీపీ బలం పెరిగింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 11 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.

శాసనమండలిలో వైసీపీ బలం పెరిగింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 11 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో 11 మంది వైసీపీ నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. దీంతో శాసనమండలిలో వైసీపీ బలం 32కు చేరుకుంది.
వచ్చే స్థానాలు కూడా....
శాసనమండలి ఛైర్మన్ గా మోషేన్ రాజు, డిప్యూటీ ఛైర్మన్ గా జకియా ఖూనంలు ఎన్నికయ్యారు. ఇక ఖాళీ అయ్యే ప్రతి స్థానం వైసీీపీ ఖాతాలోకే వెళ్లనుంది. ఇటీవల శాసనమండలి రద్దు బిల్లును వెనక్కు తీసుకుంటూ ప్రభుత్వం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. టీడీపీలో అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ప్రస్తుతం సభ్యులున్నారు.
Next Story

