Fri Mar 20 2026 10:22:35 GMT+0530 (India Standard Time)
ఊహించని పరిణామం.. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్
టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్

టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. నారా లోకేష్, కిలారి రాజేష్‌లో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు సమావేశంలో గత కొంతకాలంగా టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. రాబిన్ శర్మ టీం సర్వేలపై సమావేశంలో చర్చించనున్నారు.
గత ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పనిచేశారు ప్రశాంత్ కిషోర్. వైసీపీకి మద్దతుగా నిలిచిన ప్రశాంత్ కిషోర్ తన ఐడియాలతో వైసీపీకి మైలేజీ పెరిగేలా చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు టీడీపీ అధినేతతో భేటీ అవ్వడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారింది.
Next Story

