Wed Jan 21 2026 14:39:32 GMT+0000 (Coordinated Universal Time)
థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా? అచ్చెన్న ఫైర్
టీడీపీ కార్యకర్తలపై ధర్డ్ డిగ్రీ ఉపయోగించిన డీఎస్పీపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ధర్డ్ డిగ్రీ ఉపయోగించిన డీఎస్పీపై వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న టీడీపీ సానుభూతిపరులపై హింసకు పాల్పడటాన్ని ఆయన తప్పు పట్టారు. డీజీపీ ఈ విషయంపై దృష్టి సారించాలన్నారు. డీఎస్పీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేకుంటే తాము మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
వారిని సన్మార్గంలో పెట్టండి....
భారత దేశంలో రాజ్యాంగం ఒకటనున్నదన్న విషయాన్ని పోలీసులు మర్చిపోయారన్నారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలకడం ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అవినీతి అధికారులను బయటకు పంపడం, కొందరు అధికార పార్టీ కొమ్ముకాస్తున్న అధికారులను సన్మార్గంలో పెట్టడం డీజీపీగా తమ విధి అని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డీజీపీని డిమాండ్ చేశారు.
Next Story

