Sat Jan 18 2025 04:45:25 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ కు భద్రత పెంచిన ఏపీ సర్కార్
రాష్ట్ర ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భద్రతను పెంచింది.
రాష్ట్ర ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భద్రతను పెంచింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీని ప్రభుత్వం కేటాయించింది. ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. ఆయన తనకు కేటాయించిన విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని సందర్శించారు.
రేపు పదవీ బాధ్యతలను...
అక్కడి నుంచి నేరుగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం పవన్ కల్యాణ్ సచివాలయం వెళ్లనున్నారు. పవన్ తన ఛాంబరు పరిశీలించనున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. రేపు పవన్ కళ్యాణ్ 2నా బ్లాక్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Next Story