Sat Mar 07 2026 22:30:20 GMT+0530 (India Standard Time)
సాయితేజ కుటుంబానికి ఏపీ సర్కార్ సాయం
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. సాయితేజ కుటుంబాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా సాయితేజ కుటుంబ సభ్యలకు యాభై లక్షల రూపాయల చెక్కును అందచేయనున్నారు.
ఈరోజు స్వగ్రామానికి....
ఇటీవల జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ మరణించిన సంగతి తెలిసిందే. సాయితేజ చిత్తూరు జిల్లాకు చెందిన వారు. అంచెలంచెలుగా ఎదిగి లాన్స్ నాయక్ స్థాయికి చేరుకున్నారు. సాయితేజ భౌతిక కాయం ఈరోజు స్వగ్రామానికి చేరుకోనుంది.
Next Story

