Sun Feb 01 2026 06:09:35 GMT+0000 (Coordinated Universal Time)
పోలింగ్ శాతం 80 దాటే అవకాశం : మీనా
రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో చిట్ చాట్ చేశారు

రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో చిట్ చాట్ చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి రెండు గంటల వరకూ పోలింగ్ జరిగిందన్నారు. రాత్రి 12 గంటల వరకూ 78.25 పోలింగ్ శాతం నమోదయినట్లు ఆయన తెలిపారు. పోస్టల్ బ్యాలట్ లు 1.2 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. అయితే ఈ రెండు కలుపుకుంటూ 81 శాతం నమోదయ్యే అవకాశముందని తెలిపారు.
గత ఎన్నికలలో...
2019 లో పోస్టల్ బ్యాలట్ తో కలుపుకుంటే 79.08 శాతం పోలింగ్ నమోదయిందని ముఖేశ్ కుమార్ మీనా దెలిపారు. ఈసారి మరో రెండు శాతం అధికంగా అయి ఉంటుందని తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అధికారికంగా కాసేపట్లో వెల్లడిస్తామన్న మీనా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు.
Next Story

