Fri Dec 05 2025 14:34:33 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో ఎన్నికలకు సంబంధించి క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషనర్
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. మంగళవారం అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ను కూడా ఆమె విడుదల చేశారు. 2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
వచ్చే ఏడాది జనవరిలోగా...
అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలన్నారు. నవంబర్ 16వ తేదీ నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలన్న నీలం సాహ్ని డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్నారు. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని, చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని తెలిపారు.
Next Story

