Mon Feb 02 2026 03:21:12 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వినతులు స్వీకరిస్తున్నారు

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వినతులు స్వీకరిస్తున్నారు.రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు మంత్రి అచ్చెన్నాయుడుకు తమ సమస్యలు తెలియచేస్తున్నారు. సమస్యలను అందుకుని వాటి పరిష్కారం కోసం వెంటనే అధికారుల వద్దకు పంపుతున్నారు.
ప్రజల నుంచి సమస్యలను...
ప్రజలు వ్యక్తిగత సమస్యలతో పాటు అనేక రకమైన సామూహిక సమస్యలను కూడా అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజుకొక నేత అందుబాటులో ఉండేలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేేశారు. టీడీపీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Next Story

