Thu Mar 19 2026 07:20:20 GMT+0530 (India Standard Time)
శ్రీశైలం వెళ్లాలంటే ఇది తప్పనిసరి
శ్రీశైలం మల్లన్నస్వామి వారిని దర్శించుకునే భక్తులకు సంప్రదాయ దుస్తులను తప్పనిసరి చేస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది

శ్రీశైలం మల్లన్నస్వామి వారిని దర్శించుకునే భక్తులకు సంప్రదాయ దుస్తులను తప్పనిసరి చేస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆలయ ఈవో లవన్న స్పష్టం చేశారు. ఇకపై శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునే భక్తులందరూ ఖచ్చితంగా సంప్రదాయ వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది.
ఉచిత దర్శనానికి....
శ్రీశైలంలో వారానికి నాలుగురోజులు ఉచిత దర్శనాన్ని కల్పించారు. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులందరూ సంప్రదాయ దుస్తులతో వస్తేనే ఆలయంలోపలికి అనుమతిస్తారు. సాధారణ సమయంలోనూ ఇదే పద్ధతి కొనసాగుతుందని ఆలయ ఈవో లవన్న చెప్పారు.
Next Story

