Fri Dec 05 2025 08:21:07 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam : శ్రీశైలం అభివృద్ధికి భారీ ప్రణాళిక.. మోదీ ముందుంచనున్న ప్రతిపాదనలివే
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై అధికార పార్టీ నేతల ఆశలు పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు రూ.1,657 కోట్ల ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్పించనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు గురువారం రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై పాలకపక్ష నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటనతో ప్రాంతానికి కేంద్రం నుంచి పెద్ద మద్దతు లభిస్తుందని వారు భావిస్తున్నారు.
ఆలయ అభివృద్ధికి...
ముఖ్యంగా శ్రీశైలంలోని శైవక్షేత్రం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం రూ.1,657 కోట్ల ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రణాళికను ప్రధాని ముందు సమర్పించనున్నారు. వారణాసిలోని విశ్వనాథ్ స్వామి దేవస్థానం, ఉజ్జయినిలోని మహాకాళి దేవాలయాల నమూనాలో శ్రీశైలంలోనూ ఆలయ కారిడార్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలో ఉంది.
ప్రతిపాదనలివే...
ఇందులో తొంభై కోట్ల రూపాయలతో కొత్త క్యూకాంప్లెక్స్, 65 కోట్ల రూపాయలతో గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాళ్ల మండపం, 25 కోట్లరూపాయలతో చెరువు అభివృద్ధి, మరో 25 రూపాయల కోట్లతో కైలాసక్షేత్రం అభివృద్ధి, 13 కోట్ల రూపాయలతో కొత్త ప్రసాదం పోటు, పది కోట్ల రూపాయలతో సామూహిక అభిషేక మండపం, ఐదు కోట్ల రూపాయలతో వర్క్‌షాప్–రుద్రపార్క్ మధ్య వంతెన, 95 కోట్ల రూపాయలతో సిద్దారామప్ప కోవెలను అభివృద్ధి చేయడం వంటి పనులు ఉన్నాయి. వీటికి తోడు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను ప్రతిపాదించారు. మరి ప్రధాని దీనిపై ఎంత వరకూ స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story

