Thu Dec 18 2025 10:06:28 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబును కలిసిన మాజీ ఎంపి తనయుడు
అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీలో చేరికలు ప్రారంభమవుతున్నట్లే ఉంది. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. దాదాపు గంట నలభై ఐదు నిమిషాలు పాటు శ్రీరాజ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు.
యువతను ప్రోత్సహిస్తుండటంతో...
ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికలలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించడంతో శ్రీహర్ష టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. యువత రాజకీయాల్లోకి రావాలన్న చంద్రబాబు పిలుపు మేరకు శ్రీరాజ్ చంద్రబాబును కలసి ఆశీస్సులు తీసుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
Next Story

