Sat Dec 06 2025 08:40:48 GMT+0000 (Coordinated Universal Time)
TDP : టీడీపీ నేతకు రిలీఫ్
శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.

శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సుధీర్ రెడ్డితో పాటు 25 మందికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. చంద్రబాబును స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసిన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు...
ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు 25 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. దీంతో తమకు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు హైకోర్టును ఆశ్రయించగా వారందరికీ ముందస్తు బెయిల్ లభించింది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని, 41 ఎ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది.
Next Story

