Sun Dec 14 2025 00:24:29 GMT+0000 (Coordinated Universal Time)
మహిళా జట్టులో కడప అమ్మాయి ఘనత తెలుసా?
భారత మహిళ క్రికెట్ జట్టులో కడప అమ్మాయి శ్రీచరణి భారత్ కు విజయాన్ని అందించడంలో కీలక భూమిక పోషించింది.

భారత మహిళ క్రికెట్ జట్టులో కడప అమ్మాయి శ్రీచరణి భారత్ కు విజయాన్ని అందించడంలో కీలక భూమిక పోషించింది. కడప యువ స్పిన్నర్ శ్రి చరణి వరల్డ్‌కప్‌లో భారత్‌కు విజయం అందించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటుంది. తొలిసారి వరల్డ్‌కప్ ఆడిన శ్రి చరణి మొత్తం వికెట్లు పడగొట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని కడప పట్టణం నుంచి ప్రపంచ వేదిక దాకా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకంగా సాగింది.
పథ్నాలుగు వికెట్లు తీసి...
జట్టు గెలవడమే తనకు అసలైన ఆనందమని, వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయమే ముఖ్యం అని ఎన్.శ్రి చరణి ఎప్పుడూ చెబుతుంది.కడపకు చెందిన 21 ఏళ్ల ఎడమచేతి స్పిన్నర్ శ్రి చరణి, హర్మన్‌ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలోని భారత మహిళల జట్టులో కీలక పాత్ర పోషించింది. తొలిసారి ప్రపంచకప్ ఆడిన ఈ యువ బౌలర్ తొమ్మిది మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీయడం విశేషం. తన . మామ సూచనలతో క్రమంగా ఎదుగుతూ, జాతీయ స్థాయికి చేరిన ఆమె కృషి మహిళా క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలిచింది.
Next Story

