Fri Dec 19 2025 02:22:27 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత కన్నుమూత
రేపు విజయవాడలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించక ముందు బీఎస్ రావు యూకే..

శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ బీఎస్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొప్పన సత్యనారాయణరావు గురువారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. 40 ఏళ్లుగా శ్రీ చైతన్య విద్యాసంస్థల్ని విజయవంతంగా నడుపుతున్నారు. బీఎస్ రావు భౌతిక కాయాన్ని సాయంత్రానికి ఆయన స్వస్థలమైన విజయవాడలోని తాడిగడప కాంపస్ కు తరలించారు.
రేపు విజయవాడలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించక ముందు బీఎస్ రావు యూకే, ఇరాన్ దేశాల్లో వైద్యుడిగా పనిచేశారు. 1986లో భార్యతో కలిసి శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. అందులో భాగంగా తొలుత విజయవాడలోనే తొలి జూనియర్ కాలేజీని ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో, దేశ వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 321 జూనియర్ కాలేజీలు, 322 శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లను రన్ చేస్తున్నారు. ఎంసెట్, నీట్ వంటి పరీక్షలకు విద్యార్థులను సమాయత్తం చేస్తూ.. శ్రీచైతన్య తన మార్క్ ను చూపించింది. బీఎస్ రావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సంతాపం తెలిపారు.
Next Story

