Mon Mar 16 2026 00:50:57 GMT+0530 (India Standard Time)
దేవినేని ఉమ ఇంట విషాదం
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి శ్రీమన్నారాయణ మరణించారు. ఆయన మరణంతో దేవినేని ఇంట్లో విషాదం నెలకొంది.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి శ్రీమన్నారాయణ మరణించారు. ఆయన మరణంతో దేవినేని ఇంట్లో విషాదం నెలకొంది. దేవినేని శ్రీమన్నారాయణ స్వస్థలం కంకిపాడు మండలం నెప్పల్లి అయినప్పటికీ ఆయన కంచికచర్ల వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు 88 సంవత్సరాలు. ఆయన ఇద్దరు కుమారులు రాజకీయాల్లో రాణించారు.
ఇద్దరు కుమారులు...
దేవినేని శ్రీమన్నారయణ పెద్ద కుమారుడు రమణ మంత్రిగా ఉండి రైలు ప్రమాదంలో మృతి చెందారు. రెండో కుమారుడైన దేవినేని ఉమ కూడా మంత్రిగా పనిచేశారు. మొత్తం నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దేవినేని శ్రీమన్నారయణ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

