Sat Jul 12 2025 21:54:35 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : వైరస్ ముఖం చాటేస్తుంది.. నిజంగా ఇది గుడ్ న్యూస్ కదా?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతుంది. యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతుంది. యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. వైరస్ వ్యాప్తి నెలరోజుల్లోనే తగ్గడం ప్రారంభించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నది గణాంకాలు చెబుతున్నాయి. రోజు వారీ కేసులు తగ్గడంతో పాటు యాక్టివ్ కేసులు తగ్గుతుండటంతో పాటు కరోనా వైరస్ సోకి కోలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో క్రమేపీ కరోనా కనుమరుగవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా...
ప్రధానంగా కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అక్కడ ఉండే జనసాంద్రతతో పాటు వాతావరణ పరిస్థితులు వైరస్ పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య నామామాత్రంగానే నమోదవుతున్నాయి. అయినా భారత ప్రభుత్వం మాత్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసి అన్ని రకాలుగా ముందు జాగ్రతలు పాటించేలా చేసింది. కోవిడ్ వార్డులను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన ఔషధాలను కూడా సిద్ధం చేసింది.
ఇరవై నాలుగు గంటల్లో...
గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ఢిల్లీలో ఒక్కరోజే 65 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత 51 కేసులు రాజస్థాన్ లో నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 6,483కు పడిపోయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా కేరళలో 1,384, గుజరాత్ లో 1,105, పశ్చిమ బెంగాల్ లో 747, కర్ణాటకలో 653, ఢిల్లీలో 620 కేసులున్నాయి. ఇరవైనాలుగు గంటల్లో నలుగురు మరణించారు. కేరళ, ఢిల్లీ లో ఇద్దరు, మహారాష్ట్రలో ఇద్దరు కరోనాతో చనిపోయారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకూ ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 113కి పెరిగిందని వైద్యాధికారులు తెలిపారు.
Next Story