Mon Dec 08 2025 12:59:45 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : వచ్చే నెల పది నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్ లో అక్టోబరు 10వ తేదీ నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను బంద్ చేస్తున్నట్లు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్

ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కు చెందిన ప్రైవేటు ఆస్పత్రులు ఎన్టిఆర్ వైద్యసేవ పథకంలో చికిత్సలు అక్టోబర్ 10వ తేదీ నుంచి నిలిపివేయాలని నిర్ణయించాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఉచితంగా వైద్యం అందిస్తామని తెలిపారు. వైద్యులు సూచించిన రక్తపరీక్షలు, స్కానింగ్, శస్త్రచికిత్సలకు ముందు అవసరమయ్యే పరీక్షలు బకాయిల సమస్య పరిష్కారం కాని వరకూ ఉచితంగా చేయడం సాధ్యం కాదని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.విజయ్‌కుమార్ స్పష్టం చేశారు.
2,700 బకాయీలను...
ఆంధప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించిన రూ.670 కోట్లు అప్లోడ్ అయినట్లు, అలాగే రూ.2,000 కోట్ల క్లియరెన్స్ పరిశీలనలో ఉందని అసోసియేషన్ తెలిపారు. వైద్యులు పేర్కొన్నదాని ప్రకారం, పథకం కింద ఇచ్చే చికిత్స బిల్లులు నిబంధనల ప్రకారం 45 రోజుల్లో క్లియర్ కావాలని డిమాండ్ చేసింది. కానీ ప్రస్తుతం 400 రోజులు పడుతుండటంతో ఆస్పత్రుల యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే రూ.670 కోట్లు విడుదల చేసి, రూ.2,000 కోట్లు ఎప్పుడు ఇస్తారో షెడ్యూల్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.2,700 కోట్లుగా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. రూ.670 కోట్లు విడుదలయ్యే వరకు ప్రభుత్వంతో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.
Next Story

