Mon Apr 06 2026 20:34:47 GMT+0530 (India Standard Time)
ఏపీ, తెలంగాణలో SIR ప్రక్రియ ఎప్పటి నుంచి అంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇరవై రెండు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభించాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఈ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది.
వచ్చే ఏప్రిల్ నెల నుంచి...
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కు సంబంధించిన కసరత్తులను ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దేశంలోని పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ మొదలయింది. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Next Story

