Thu Apr 02 2026 20:22:30 GMT+0530 (India Standard Time)
గర్భిణుల కోసం ప్రత్యేక వాహనాలు... జగన్ జెండా ఊపి
గర్భిణుల కోసం అత్యవసర వైద్య సేవలందించేందుకు ప్రత్యేక వాహనాలు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో సిద్దం కానున్నాయి

గర్భిణుల కోసం అత్యవసర వైద్య సేవలందించేందుకు ప్రత్యేక వాహనాలు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో సిద్దం కానున్నాయి. దాదాపు 500 వాహనాలను ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. బెంజి సర్కిల్ లో జరిగే ఈ కార్యక్రమానికి జగన్ తో పాటు మంత్రులు కూడా హాజరవుతారు. వైఎస్సార్ తల్లి, బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలో భాగంగా 500 ఏసీ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
నెలలు నిండిన వారిని...
నెలలు నిండిన వారిని ఇంటి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ఈ వాహనాన్ని వినియోగిస్తారు. వైఎస్సార్ తల్లీ, బిడ్డ ఎక్స్ ప్రెస్ సేవలను మరింత విస్తృత పర్చేందుకు జగన్ ప్రభుత్వం ఈ వాహనాలను కొనుగోలు చేసింది. ప్రసవం అనంతరం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా తల్లికి విశ్రాంతి సమయంలో అవసరాల కోసం ఐదు వేల రూపాయలు ఇచ్చి తల్లి, బిడ్డను క్షేమంగా ఇంటివద్ద దిగబెట్టి వస్తారు. ఈ వాహనాలను జెండా ఊపి జగన్ నేడు ప్రారంభించనున్నారు.
Next Story

