Thu Dec 18 2025 18:03:35 GMT+0000 (Coordinated Universal Time)
Budget2024: ఏపీకి భారీగా నిధుల కేటాయింపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా నిధులు కేటాయించారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విశాఖ- చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు కేటాయించామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లను ప్రత్యేక సాయంగా అందిస్తామని చెప్పారు. అమరావతి అభివృద్ధికి అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయసహకారాలు అందిస్తామని అన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
Next Story

