Fri Dec 05 2025 19:07:57 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల లడ్డూ వివాదంలో విచారణ వేగవంతం
తిరుమల లడ్డూ వివాదంలో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఇద్దరిని కస్డడీలోకి తీసుకుని విచారించనుంది

తిరుమల లడ్డూ వివాదంలో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఇద్దరిని కస్డడీలోకి తీసుకుని విచారించనుంది. నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం అందుకు అనుమతించింది. కల్తీ నెయ్యి ఘటన ఆరోపణలు పై సి.బి. ఐ తో పాటు సిట్ విచారణ కొనసాగుతుంది. కల్తీ నెయ్యిని కలిపారంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో సుప్రీంకోర్టుట సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
విచారించేందుకు...
ఈ కేసులో బోలెబాబ మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ హరి మోహన్ ను కస్టడీకీ తీసుకోనుంది. ఈయన హరిద్వార్ కు చెందిన వారు. ఇక ఏ 15వ నిందితుడిగా ఈ కేసులో ఉన్న ఆశిష్ అగర్వాల్ ను కూడా కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఈయన బికనీర్, రాజస్థాన్ కు చెందిన వారు. విచారణ నిమిత్తం 5రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ బృందం ఈనెల 24 నుండి 28 వరకు సిట్ అధికారులు. విచారించనున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు అరెస్ట్ చేసిన సి.బి. ఐ, సిట్ బృందం విచారణ ముమ్మరం చేసింది.
Next Story

