Fri Dec 05 2025 13:59:41 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ జగన్ పీఏ ఇంట్లో సిట్ సోదాలు
వైసీపీ అధినేత వై ఎస్ జగన్ పీఏ ఇంట్లో స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

వైసీపీ అధినేత వై ఎస్ జగన్ పీఏ ఇంట్లో స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మద్యం స్కామ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. నాగేశ్వర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి ఇంట్లో కూడా సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11.20 నిమిషాల వరకు అధికారులు సోదాలు నిర్వహించారు.
లిక్కర్ స్కామ్ కేసులో...
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల కోసం పోలీసుల గాలిస్తున్నారు. నిన్న నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ను ఆంధ్రప్రదేవ్ హైకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టులో కూడా వీరికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఇద్దరి కోసం సిట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story

