Thu Mar 19 2026 04:26:51 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : జగనన్నా... ఆ ఎమ్మెల్సీని మీరెందుకు సమర్థిస్తున్నారు?
కడప జిల్లాలో వైఎస్ షర్మిల ప్రచారం లో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు

సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపేశారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇరవై ఎనిమిది పథకాలను అర్థాంతరంగా ఎందుకు ఆపేశారన్నారు. కడప జిల్లాలో వైఎస్ షర్మిల ప్రచారం లో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయిందని ఆమె ప్రశ్నించారు.
ఆ పథకాలు ఏవీ?
విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారన్నారు. ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయని, . ఇది మీ వివక్ష కాదా అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. డ్రైవర్ ను చంపి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారని వైఎస్ షర్మిల నిలదీశారు. స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్ షర్మిల అడిగారు.
Next Story

