Sun Mar 08 2026 02:56:24 GMT+0530 (India Standard Time)
నేడు నోటిఫికేషన్.. ఇటు అనర్హత వేటుపై నిర్ణయం?
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ ప్రారంభించనున్నారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ ప్రారంభించనున్నారు. వైసీపీ రెబల్ పై స్వయంగా నేడు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో ఒకేసారి వివరణ తీసుకోనున్నారు. ఇప్పటికే లిఖితపూర్వకంగా రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి నేడు స్పీకర్ నేరుగా వారితో విచారణ జరపనున్నారు.
రెబల్ ఎమ్మెల్యేలతో...
రెబల్ ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయాలా? వద్దా అన్న విషయంపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకోనున్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదలకానున్న సమయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Next Story

