Sat Mar 07 2026 18:15:39 GMT+0530 (India Standard Time)
తమ్మినేనికి ఈ తలనొప్పులేంటో?
స్పీకర్ తమ్మినేని సీతారాంకు గట్టి షాక్ తగిలింది. ఆముదాలవలస మండలం కట్యాచారులుపేట ఎంపీటీసీ టీడీపీ కైవసం చేసుకుంది

స్పీకర్ తమ్మినేని సీతారాంకు గట్టి షాక్ తగిలింది. ఆముదాలవలస మండలం కట్యాచారులుపేట ఎంపీటీసీ టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడేపల్లి సుగుణమ్మ 256 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి స్పీకర్ తమ్మినేని సీతారాం ఇలాకాలో ఓటమి పాలయ్యారు.
గతంలోనూ...
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ్మినేని సీతారాంకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. రాష్ట్రమంతటా వైసీపీ గెలుస్తున్నా తమ్మినేని సీతారాం నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుండటం విశేషం.
Next Story

