Fri Mar 27 2026 23:03:18 GMT+0530 (India Standard Time)
అసెంబ్లీలో గందరగోళం.. ఆఖరి రోజూ సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కూడా టీడీపీ సభ్యులు సస్పెడ్ అయ్యారు. స్పీకర్ పైకి పేపర్లు చించి వేయడంతో స్పీకర్ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద కు టీడీపీ సభ్యులు దూసుకెళ్లి నినాదాలు చేస్తుండటంతో టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
సభలో బిల్లులు...
ఉదయం సభ వాయిదా పడి తిరిగి ప్రారంభమయిన వెంటనే సభలో బిల్లులు ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడాన్ని టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యనే బిల్లులను శాసనసభ ఆమోదించింది. టీడీపీ సభ్యులు ఎంతకూ బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ ను ఉపయోగించి వారిని సభ బయటకు పంపారు.
Next Story

