Fri Dec 05 2025 16:44:21 GMT+0000 (Coordinated Universal Time)
ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభ కార్యక్రమాలకు పదే పదే అడ్డుతగలడంతో పాటుగా ఈలలు వేయడం, చిడతలు తెచ్చి వాయించడం వంటివి సభ గౌరవ మర్యాదలను కించపర్చే విధంగా ఉన్నాయని స్పీకర్ చెప్పారు. టీడీపీ సభ్యులను రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.
ఎథిక్స్ కమిటీకి...
మరోవైపు టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీ విచారించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు జారీ చేశారు. ఎథిక్స్ కమిటీ విచారించి తగిన చర్యలను సూచించాలని స్పీకర్ కోరారు. స్పీకర్ పైనే కాగితాలు చించి విసిరేయడం, ఈలలు వేయడం, చిడతలు వాయించడం వంటివి స్పీకర్ సీరియస్ గా పరిగణించారు. ఎథిక్స్ కమిటీ సూచనల మేరకు చర్యలు ఉంటాయని స్పీకర్ వెల్లడించారు.
Next Story

