Fri Dec 05 2025 17:40:19 GMT+0000 (Coordinated Universal Time)
పదకొండు మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
సభకు పదే పదే అంతరాయం కల్గిస్తున్న పదకొండు మంది టీడీపీ శాసనసభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సభకు పదే పదే అంతరాయం కల్గిస్తున్న పదకొండు మంది టీడీపీ శాసనసభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులు అడిగిన వెంటనే చేయడానికి ఇది బహిరంగ సభ కాదని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలపై విచారణ జరపాలని, చర్చకు అనుమతించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
ఒకరోజు ...
బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవాని, వెలగపూడి రామకృష్ణ, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, గణబాబు, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, జోగేశ్వరరావులను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈరోజు వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగుతుంది.
Next Story

