Sun Mar 08 2026 04:24:07 GMT+0530 (India Standard Time)
ఏం నేను ప్లీనరీలో పాల్గొనకూడదా?
రెండో రోజు వైసీపీ ప్లీనరీలో స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు

రెండో రోజు వైసీపీ ప్లీనరీలో స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్లీనరీలో ఎందుకు పాల్గొనకూడదో రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. మహానాడులో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ పాల్గొనలేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్లీనరీకి వైసీపీ కార్యకర్తలు విప్లవంలా తరలి వచ్చారని తెలిపారు. గడప గడపలో జగన్ నామస్మరణం వినిపిస్తుందని ఆయన చెప్పారు.
వైసీపీ సభ్యుడిని...
తాను వైసీపీ ప్రాధమిక సభ్యుడినని తమ్మినేని సీతారాం చెప్పారు. వైసీపీ సభ్యుడి తర్వాతనే ఎమ్మెల్యేనని, ఆ తర్వాత స్పీకర్ నని ఆయన చెప్పారు. పార్టీ ప్లీనరీ పండగ జరగుతుంటే ఇంట్లో కూర్చోవాలా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అవి ఎల్లో మీడియాకు కన్పించడం లేదా అని తమ్మినేని నిలదీశారు.
Next Story

