Sun Mar 08 2026 02:55:54 GMT+0530 (India Standard Time)
అనర్హత వేటుపై నిర్ణయం ఈరోజే చెబుతారా?
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఈరోజు స్పీకర్ తమ్మినేని సీతారామ్ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఈరోజు స్పీకర్ తమ్మినేని సీతారామ్ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో నిన్న స్పీకర్ సమావేశమయ్యారు. వారి నుంచి వివరణ కోరారు. ఇప్పటికే మూడు వారాల పాటు సమయం ఇచ్చిన స్పీకర్ ఈరోజు లేదా రేపు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు.
ఎనిమిది మందికి...
వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతుదారులుగా నిలిచిన ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి అనుకూలంగా మారిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిల అనర్హత పిటీషన్ పై స్పీకర్ నేడు నిర్ణయం ప్రకటించే అవకాశముంది. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో నిన్న అంచ్ మోషన్ దాఖలు చేయగా, విచారణను వచ్చే నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
Next Story

