Sun Mar 08 2026 04:24:06 GMT+0530 (India Standard Time)
స్పీకర్ సీరియస్... ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు
తెలుగుదేశం పార్టీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు

తెలుగుదేశం పార్టీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఆయన ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రివిలేజ్ సూచించారు. గత ఐదు రోజుల నుంచి టీడీపీ సభ్యుల ప్రవర్తన సరిగా లేదని ఈరోజు శృతి మించిందని స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.
టీడీపీ సభ్యుల ప్రవర్తన...
స్పీకర్ పోడియం పైకి చేరుకోవడమే కాకుండా పేపర్లు చించి విసిరేయడం పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శాసనసభ వర్షాకాల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు.
Next Story

