Sun Mar 08 2026 02:56:19 GMT+0530 (India Standard Time)
ఆ నలుగురికి మరోసారి నోటీసులు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం చివరి అవకాశమిచ్చారు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం చివరి అవకాశమిచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన నలుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19వ తేదీ హాజరు కావాలని ఇదే తుది విచారణగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విచారణ అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది. ఈ నెల 19వ తేదీన స్పీకర్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు.
చివరి అవకాశంగా...
వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అనేక సార్లు నోటీసులు జారీ చేసినా పూర్తి స్థాయి విచారణకు హాజరుకాలేదని, ఇదే చివరి అవకాశమని ఆయన పేర్కొన్నారు. అయితే నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం తాము న్యాయనిపుణుల సూచనల మేరకు హాజరు కావాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.
Next Story

