Sun Mar 15 2026 12:09:48 GMT+0530 (India Standard Time)
టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కల్గిస్తుండటంతో 11 మంది సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈరోజు సభ ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు నాటుసారా విక్రయాలు, జంగారెడ్డిగూడెం లో వరస మరణాలపై చర్చించాలని పట్టుబట్టారు.
ఐదోరోజు కూడా....
అయితే స్పీకర్ దానిని తిరస్కరించారు. పదే పదే తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని స్పీకర్ సూచించినా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులను వరసగా ఐదోరోజు కూడా సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది.
Next Story

