Sun Mar 15 2026 23:12:13 GMT+0530 (India Standard Time)
రఘురామ రాజు అనర్హత పిటీషన్ పై విచారణ ప్రారంభం
రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత పిటీషన్ పై స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు.

రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత పిటీషన్ పై స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. దీనిని ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ పంపారు. రఘురామ కృష్ణరాజు అనర్హత పిటీషన్ పై త్వరితగతిన విచారణ ప్రారంభించి నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఓం బిర్లా ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు.
ప్రివిలేజ్ కమిటీకి....
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ స్పీకర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన ఆధారాలను కూడా స్పీకర్ కు సమర్పించారు. అయితే వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఇచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారు. వచ్చే నెల 3వ తేదీన ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story

