Fri Dec 05 2025 11:16:47 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యన్న ఆ ప్రకటన అందుకే చేశారా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడు పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉన్నారు. ఆ పార్టీలోనే ఎదిగారు. అతి చిన్న వయసులోనే మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడికి ఈసారి చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ లభించలేదు.
తన వారసుడికి...
అయితే ఆయనను స్పీకర్ గా ఎంపిక చేశారు. అయితే అయ్యన్నపాత్రుడు తన వారసుడి రాజకీయాల కోసమే ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు చెబుతున్నారు. విజయ్ పాత్రుడికి రాజకీయంగా రూట్ క్లియర్ చేయడానికి అయ్యన్న ఈ నిర్ణయం తీసుకున్నారని, వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి విజయ్ పాత్రుడు పోటీ చేసేందుకు వీలుగా ఆయన ఈ ప్రకటన చేసినట్లు కనపడుతుంది.
Next Story

