Wed Jan 28 2026 19:32:31 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ తీరుపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం
శాసనసభలో నిన్న వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

శాసనసభలో నిన్న వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో నిన్నటి పరిణామాలు బాధ కలిగించాయని అయ్యన్న అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సభ ప్రారంభం కాగానే స్పీకర్ మాట్లాడుతూ గవర్నర్ని అతిథిగా ఆహ్వానించి ఆయనతో ప్రసంగం ఇప్పిస్తే సభ్య సమాజం అసహ్యించుకునేలా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారని స్పీకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా...
తన పార్టీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రసంగం పుస్తకాలు చించుతుంటే వారిని జగన్ నియంత్రించాల్సింది పోయి కూర్చుని నవ్వుకోవడమేంటని ని స్పీకర్ ప్రశ్నించారు. బొత్స లాంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పకపోవటం సరికాదని హితవు పలికారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఇకపై అయినా విజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. రాజ్యాంగం ద్వారా కాకుండా సర్వ హక్కులు తనకే ఉన్నాయి అన్నట్లు ప్రవర్తించటం ఎవరికీ తగదని అన్నారు.
Next Story

