Sat Mar 28 2026 12:52:21 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : రాజధానికి సహకరిస్తారనుకున్నా : అయ్యన్నపాత్రుడు
ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వం కొనసాగించిన విధానాలను కొనసాగించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు

ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వం కొనసాగించిన విధానాలను కొనసాగించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక శాసనసభ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత రాజధానిగా అమరావతిని నిర్ణయించిందని, అయితే 2019లో వచ్చిన ప్రభుత్వం దానిని నీరుగార్చే విధంగా పాలన కొనసాగించిందని అయ్యన్న పాత్రుడు అన్నారు.
పదకొండు మంది వచ్చి...
ఐదున్నర కోట్ల మంది ఆంధ్రప్రజలకు అవసరమైన రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే అంశానికి అందరూ మద్దతు పలుకుతారని ఆశించానని, కానీ ఆ పదకొండు మంది సభ్యులు సభకు వచ్చి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తారని తాను ఆశిస్తున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అధికారికంగా గుర్తించే ప్రక్రియకు సహకరించాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో అమరావతి రాజధాని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Next Story

