Tue Feb 07 2023 15:12:39 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పాదయాత్రకు అందుకే అనుమతిచ్చాం
నారా లోకేష్ పాదయాత్రకు పదిహేను నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు

నారా లోకేష్ పాదయాత్రకు పదిహేను నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. టీడీపీ శ్రేణులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయన్నారు. తామేమీ కఠిన నిబంధనలను విధించలేదన్న ఎస్పీ సాధారణ కార్యక్రమాలకు ఎలాంటి నిబంధనలను విధిస్తామో అలాంటి షరతులనే లోకేష్ పాదయాత్రకు కూడా విధించినట్లు ఆయన తెలిపారు.
జాతీయ రహదారి పై...
కుప్పంలో జరిగే పాదయాత్ర పూర్తిగా తమిళనాడు, కర్ణాట, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని జాతీయ రహదారి పై ఉందని, అందుకే అన్ని నిబంధనలు విధించడం జరిగిందని ఆయన వివరించారు. టీడీపీ నేతలు అనుకుంటున్నట్లు కఠిన నిబంధనలు ఏమీ లేవని ఆయన తెలిపారు. సజావుగా పాదయాత్ర జరగడానికే నిబంధనలను విధిస్తామని చెప్పారు.
Next Story