Tue Jan 20 2026 11:40:51 GMT+0000 (Coordinated Universal Time)
అల్లర్లకు పాల్పడ్డారంటే.. చూస్తూ ఊరుకోం
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎస్పీ మల్లికా గార్గ్ పర్యటించారు. శాంతి భద్రతలను సమీక్షించారు

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో ఎస్పీ మల్లికా గార్గ్ పర్యటించారు. శాంతి భద్రతలను సమీక్షించారు. ర్వత్రిక ఎన్నికలలో భాగంగా జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఘర్షణలు జరగకుండా మాచర్ల నియోజకవర్గం లోని వెల్దుర్తి , రెంటచింతల, కారంపూడి, దుర్గి మాచర్లలో, ప్రతి ఫ్యాక్షన్ గ్రామాలలో ఇప్పటికీ ఫ్యాక్షన్ తగాదాన్ని నిరుగప్పిన నిప్పులా ఉన్నాయని ఆమె తెలిపారు. ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆయా మండలాల్లో మరోసారి అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
అన్ని గ్రామాలను...
సమయం కూడా చాలా తక్కువ ఉన్నందున అన్ని గ్రామాలను జల్లెడ పడతామని, అనుమానితులు కూడా విచారిస్తామని మల్లికా గార్గ్ తెలిపారు. కార్డెన్ సెర్చ్ నిర్వహించి క్షుణ్ణంగా పరిశీలిస్తామన్న మల్లికా గార్గ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకొని ప్రతి ఒక్కరు లా అండ్ ఆర్డర్స్ కు సహకరించాలని కోరారు. మాచర్లలోని ముందస్తు చర్యలో భాగంగా పట్టణంలోని అన్ని షాపులను పోలీసులు మూసి వేయించడం జరిగిందని ఆమె తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story

